Zakir Hussain: గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డుల్లో మెరిసిన భారత్

  • బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌ అవార్డులు గెలుచుకున్న జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌
  • ఫ్యూజన్ బ్యాండ్ ‘శక్తి’కి దక్కిన అవార్డులు
  • ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి రెండో అవార్డు దక్కించుకున్న బృందం
India shines at Grammy 2024 awards and Zakir Hussain and Shankar Mahadevan got awards for Best Global Music Album awards

ప్రపంచ ప్రఖ్యాత ‘గ్రామీ 2024’ మ్యూజిక్ అవార్డ్స్‌లో భారత్ మరోసారి మెరిసింది. భారతీయ సంగీత దిగ్గజాలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌ల ఫ్యూజన్ బ్యాండ్ ‘శక్తి’కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డును అందుకునేందుకు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, బృందం సభ్యులు లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డు గెలుచుకున్న సందర్భంగా బృంద సభ్యులు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవార్డు గెలుచుకున్న బృందంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

మూడు సార్లు గ్రామీ అవార్డు దక్కించుకున్న ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్.. శంకర్ మహదేవన్ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవార్డు గెలుచుకున్న శక్తి బ్యాండ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘శక్తి’ 2024 గ్రామీ అవార్డులను గెలుచుకుందని, ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారని రికీ కేజ్ పేర్కొన్నారు. ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి శంకర్ మహదేవన్, సెల్వగణేష్, గణేశ్ రాజగోపాలన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ రెండో అవార్డును గెలుచుకున్నారని ప్రస్తావించారు. కాగా జాన్ మెక్‌లాఫ్లిన్, జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, వీ.సెల్వగణేశ్, గణేశ్ రాజగోపాలన్‌ల సహకారంతో ‘శక్తి’ బ్యాండ్‌ను రూపొందించారు.

More Telugu News