CBI: శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

CBI charge sheet against a woman for Fake documents on Sridevi death
  • శ్రీదేవి మరణంపై భారత్-యూఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచిపెట్టాయని ఆరోపించిన భువనేశ్వర్‌కు చెందిన మహిళ
  • తన వాంగ్మూలం నమోదు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమన్న నిందితురాలు దీప్తి
  • ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన నిందితురాలు
దిగ్గజ నటి శ్రీదేవి మరణంపై తాను సొంతంగా విచారణ జరిపానని, యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచినట్టు తేలిందంటూ నకిలీ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటిపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ ఆదివారం వెల్లడించింది. ఈ పరిణామంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.

శ్రీదేబి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై దీప్తి చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి మరణంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఏఈ-భారత్‌ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్ల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఇవే సాక్ష్యాలు అంటూ ప్రదర్శించారు. రంగంలోకి దిగిన సీబీఐ దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. ఇవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబైకి చెందిన చాందినీ షా అనే న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీదేవి 2018లో దుబాయ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే.
CBI
Sridevi death
CBI charge sheet
Deepthi

More Telugu News