MP Balashauri: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి

Machilipatnam MP Balashauri joined Janasena in the presence of Pawan Kalyan
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని
  • కొడుకు అనుదీప్‌తో కలిసి పార్టీలో చేరిన బాలశౌరి
  • పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్లు నాదెండ్ల మనోహర్, నాగబాబు

మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ కండువా కప్పి బాలశౌరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు పాల్గొన్నారు. 

పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం ఎంతో గర్వకారణంగా ఉందని బాలశౌరి ఉందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదంటూ వైసీపీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తెనాలి పార్లమెంట్ సభ్యుడిగా తాను, తెనాలి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ పనిచేశామని ఆయన చెప్పారు. ఆ ఐదేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశామని, ప్రస్తుతం అలాంటి పరిస్థితిలేదన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదన్నారు. పవణ్ కల్యాణ్‌లో ప్రశ్నించే గుణం ఉందని, అందుకే ప్రభుత్వం ఉద్ధానం కిడ్నీ సమస్యను పరిష్కరించిందని అన్నారు.

  • Loading...

More Telugu News