Irphan Pathan: పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత భార్యను పరిచయం చేసిన మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్

Irphan Pathan shares wife pic after eight years of their marriage
  • 2016లో ఓ ఇంటివాడైన ఇర్ఫాన్ పఠాన్
  • హైదరాబాద్ మోడల్ సఫా బేగ్ తో వివాహం
  • నేడు ఎనిమిదో వివాహ వార్షికోత్సవం
  • భార్య ఫొటో పంచుకున్న ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్ గానూ, క్రికెట్ వ్యాఖ్యాత గానూ కొనసాగుతున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ 2016లో హైదరాబాద్ కు చెందిన మోడల్ సఫా బేగ్ ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

అయితే, పెళ్లయిన ఎనిమిదేళ్లకు ఇర్ఫాన్ పఠాన్ తన భార్య సఫాను పరిచయం చేయడం విశేషం. తమ వివాహ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో తన భార్య ఫొటోను పంచుకున్నాడు. 

గతంలోనూ పలు ఫొటోలు షేర్ చేసినప్పటికీ, ఆ ఫొటోల్లో ఎక్కడా ఆమె ముఖం స్పష్టంగా కనిపించలేదు. దాంతో అప్పట్లో ఇర్ఫాన్ పై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు, తన భార్యతో కలిసున్న ఫొటోను పోస్టు చేయడం ద్వారా విమర్శలకు కూడా చెక్ పెట్టేశాడు. 

"నా లైఫ్ లో అపరిమితమైన పాత్రలను పోషించే నా జీవిత భాగస్వామి, తోడునీడగా నిలిచే సహచరి, నా స్నేహితురాలు, నా బిడ్డలకు తల్లి... ఇలా అనేక రూపాల్లో మద్దతుగా నిలుస్తున్నావు... మన వైవాహిక జీవితానికి ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా నీకు ప్రేమ పూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను" అంటూ తన పోస్టులో పేర్కొన్నాడు.
Irphan Pathan
Safa Baig
Wife
Marriage
Team India
Cricket

More Telugu News