Chandrababu: ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్

Pawan Kalyan goes to CBN house in Undavalli
  • ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన
  • ఇంకా ఓ కొలిక్కిరాని సీట్ల పంపకం
  • నేడు చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం

ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నేడు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పవన్ కు చంద్రబాబు, అచ్చెన్నాయుడు పుష్పగుచ్ఛాలు అందించి సాదర స్వాగతం పలికారు. అనంతరం, చంద్రబాబు, పవన్ సమావేశమయ్యారు. ప్రధానంగా సీట్ల పంపకం గురించే చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ 25 సీట్లు ఇస్తామని చెబుతుండగా, మరిన్ని సీట్లు కావాలని జనసేన అధినాయకత్వం కోరుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News