అద్వానీకి భారతరత్న రావడంపై కూతురు ప్రతిభా అద్వానీ స్పందన
- తన తండ్రికి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్న ప్రతిభా అద్వానీ
- అద్వానీ తన జీవితమంతా దేశసేవకే అంకితం చేశారని వ్యాఖ్య
- తండ్రికి మిఠాయి తినిపించిన కూతురు
అద్వానీకి భారతరత్న ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత, తన కుమార్తె ప్రతిభా అద్వానీతో కలిసి ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభా అద్వానీ తన తండ్రికి మిఠాయి తినిపించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయంతో సంతోషంగా ఉన్న ప్రతిభా అద్వానీ తండ్రిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.