వెంకయ్య నాయుడిని కలిసిన భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌

Bharat Biotech Chirmen meets Venkaiah Naidu
  • వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ పురస్కారం
  • అభినందనలు తెలియజేసిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల
  • వెంకయ్యనాయుడిని కలిసిన డీకే అరుణ
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు. మరోవైపు బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూడా వెంకయ్యనాయుడిని కలిసి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవికి కూడా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Go Back to Shorts
Venkaiah Naidu
DK Aruna
BJP
Padma Vibhushan
Krishna Yella
Suchitra Yella
Bharat Biotech

More Telugu News