షర్మిలపై దారుణమైన పోస్టర్లు వేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు: వి.హనుమంతరావు
- జగన్ కోసం షర్మిల ఎంతో కష్టపడిందన్న వీహెచ్
- వైఎస్ కూతురు కాదని ప్రచారం చేస్తున్నా జగన్ స్పందించడం లేదని మండిపాటు
- రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతారా? అని ఆగ్రహం
షర్మిల రాజశేఖరరెడ్డి కూతురు కాదని తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్లు వేస్తున్నా జగన్ స్పందించడం లేదని వీహెచ్ దుయ్యబట్టారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే తనకు ఎంతో ఆవేదన కలుగుతోందని చెప్పారు. రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతాడా? అని ప్రశ్నించారు. షర్మిల, సునీతలపై జగన్ కు గౌరవం లేదని విమర్శించారు. చెడు సంప్రదాయాలను పక్కన పెట్టాలని సూచించారు. అధికారం ఉందని ఎగిరెగిరి పడితే ప్రజలు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.