rahul bojja: ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి

  • ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్న రాహుల్ బొజ్జా
  • కేంద్ర జలశక్తి శాఖ మినట్స్ తప్పుగా వచ్చాయని వెల్లడి
  • నీటి నిర్వహణ మాత్రమే కేఆర్ఎంబీ చూసుకుంటుంది... డ్యామ్‌లు ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయన్న రాహుల్ బొజ్జా
Rahul Bojja clarity on project for KRMB

ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని తాము ఎక్కడా చెప్పలేదని తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం తెలిపారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇస్తారనే వార్తలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్ర జలశక్తి శాఖ మినట్స్ తప్పుగా వచ్చాయన్నారు. సవరణ కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తాము లేఖ రాశామన్నారు. ప్రాజెక్టులను ఇస్తామని తాము ఎక్కడా చెప్పలేదని వివరణ ఇచ్చారు.

అభ్యంతరాలు నివృత్తి చేస్తేనే ప్రాజెక్టులను అప్పగిస్తామని తేల్చి చెప్పారు. నీటి నియంత్రణ ఇప్పటికే కేఆర్ఎంబీ నిర్వహిస్తోందని... ప్రాజెక్టుల అప్పగింతపై కొత్తగా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం మేరకు నీటి విడుదల ఉంటుందన్నారు. ఇప్పటి వరకు నీటి నిర్వహణ మాత్రమే కేఆర్ఎంబీ చూసుకుంటుందని... డ్యామ్‌ల నిర్వహణ ఆయా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని వెల్లడించారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తున్నారనే ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.

More Telugu News