అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. వారం రోజుల వ్యవధిలో మూడో ఘటన
- కలవరపెడుతున్న విద్యార్థుల మరణాలు
- శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి మృతికి సంతాపం తెలిపిన భారత రాయబార కార్యాలయం
- ఆయన కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని హామీ
శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. కాగా, ఈ వారంలో వివేక్ సైనీ, నీల్ ఆచార్య అనే మరో ఇద్దరు భారతీయ విద్యార్థులు కూడా మరణించారు. శ్రేయాస్ మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.