Visa: అమెరికా వీసా ఫీజులు పెరిగాయి... వివరాలు ఇవిగో!

  • నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులు పెంచిన అమెరికా
  • హెచ్1బీ, ఎల్1, ఈబీ5 వీసాల ఫీజుల పెంపు
  • పెంచిన రేట్లు ఏప్రిల్ 1 నుంచి వర్తింపు
US govt hikes Visa fees

అగ్రరాజ్యం అమెరికా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులు పెంచింది.  హెచ్1బీ, ఎల్1, ఈబీ5 వీసాల ఫీజు, దరఖాస్తు ఫీజును పెంచుతూ ఓ ప్రకటన చేసింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

వీసా                         పాత ఫీజు              కొత్త ఫీజు
హెచ్1బీ                   రూ.38,160         రూ.64,706
హెచ్1బీ రిజిస్ట్రేషన్       రూ.829              రూ.17,835
ఎల్1                       రూ.38.160         రూ.1,14,887
ఈబీ6                      రూ.3,04,845      రూ.9,25,718  

హెచ్1బీ వీసా: ఇతర దేశాల వృత్తి నిపుణులకు అమెరికాలో ప్రవేశం కోసం ఈ వీసాలు జారీ చేస్తారు. 
ఎల్1 వీసా: వివిధ దేశాల్లో బ్రాంచిలు ఉన్న అమెరికన్ కంపెనీలు ఆయా బ్రాంచిల నుంచి అమెరికాలో పనిచేసేందుకు ఉద్యోగులను రప్పిస్తుంటాయి. ఈ అంతర్గత బదిలీలపై వచ్చేవారికి ఇచ్చే వీసాను ఎల్1 వీసాగా పరిగణిస్తారు.
ఈబీ5 వీసా: అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఇచ్చే వీసాలు ఇవి. రూ.4 కోట్లు, అంతకుమించి పెట్టుబడి పెట్టగలిగి ఉండి, కనీసం 10 మందికి ఉపాధి కల్పించగల పెట్టుబడిదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఈబీ5 వీసాలు కేటాయిస్తారు.

More Telugu News