Varla Ramaiah: ఓటరు తుది జాబితాలో తప్పులు సరిదిద్దండి... ఎన్నికల సంఘానికి వర్ల రామయ్య లేఖలు

  • ఏపీ ఓటరు జాబితాల్లో అక్రమాలు అంటూ విపక్షాల పోరాటం
  • ఇటీవల ఓటరు తుది జాబితా విడుదల
  • కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు 3 లేఖలు రాసిన వర్ల రామయ్య
Varla Ramaiah wrote three letters to ECI

ఏపీలో ఓటరు జాబితాల్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ గత కొన్నాళ్లుగా విపక్షాలు పోరాటం సాగిస్తున్నాయి. తాజాగా, ఇటీవల విడుదల ఓటరు తుది జాబితాలోనూ తప్పులు ఉన్నాయంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కేంద్ర ఎన్నికల సంఘానికి 3 లేఖలు రాశారు. 

ఓటరు జాబితా అవకతవకలపై వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల తాలూకు క్లిప్పింగ్ లను కూడా వర్ల రామయ్య తన లేఖలకు జత చేశారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దాలని వర్ల రామయ్య కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ముఖ్యమంత్రి గారూ మీకు భారతం కూడా అట్టే తెలిసినట్టు లేదు!

ఇటీవల సీఎం జగన్ భీమిలి సభలో మాట్లాడుతూ, పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడ్ని కాదని, ఇక్కడున్నది అర్జునుడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వర్ల రామయ్య నేడు సోషల్ మీడియాలో స్పందించారు. 

"ముఖ్యమంత్రి గారూ... మీకు భారతం కూడా అట్టే తెలిసినట్టు లేదు. బాలుడైన అభిమన్యుడ్ని కించపరిచే రీతిలో మాట్లాడుతున్నారు. వీరోచితంగా పోరాడి తన ప్రాణాలు అర్పించి పెదనాన్న, బాబాయిలను రక్షించిన ధీరోదాత్తుడు అభిమన్యుడు. మరి ఈనాటి అర్జునులు తమ స్వంత బాబాయిలనే గొడ్డళ్లతో నరికివేస్తున్నారు... కదూ?" అంటూ  వర్ల రామయ్య తన ట్వీట్ లో ఎత్తిపొడిచారు.

More Telugu News