KRMB: ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం... హాజరైన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు

KRMB meet held in Hyderabad as two states ENCs attended
  • హైదరాబాదులోనే కేఆర్ఎంబీ సమావేశం
  • శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ కేఆర్ఎంబీకి అప్పగింత
  • నీటి వాటాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం త్రిసభ్య కమిటీదే!
  • నీటి నిర్వహణ అవుట్ లెట్స్ బోర్డుకు అప్పగింత
హైదరాబాదులో నేడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)లు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. 

ఈ సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి స్పందిస్తూ... కేఆర్ఎంబీకి శ్రీశైలం, సాగర్ నిర్వహణ అప్పగింతకు అంగీకరించామని వెల్లడించారు. ఏపీలో 9, తెలంగాణలో 6 కాంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం అని పేర్కొన్నారు. సిబ్బంది కేటాయింపునకు రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి వెల్లడించారు. 

తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు స్పందిస్తూ... కృష్ణా జలాల్లో 50 శాతం వాటా డిమాండ్ కు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించేందుకు ఢిల్లీ వేదిక ఉందని తెలిపారు. నీటి నిర్వహణను అవుట్ లెట్స్ బోర్డుకు అప్పగించేందుకు నిర్ణయించినట్టు వివరించారు. అవుట్ లెట్స్ ను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. 

ఇక, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చ జరగలేదని తెలిపారు. నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు చెప్పారు.
KRMB
Andhra Pradesh
Telangana
Krishna River
Hyderabad

More Telugu News