Nampally Exhibition: నాంపల్లి ఎగ్జిబిషన్‌లో భర్త వెకిలి చేష్టలు.. చెంప పగలుగొట్టిన భార్య

Wife Slaps Husband As He Misbehave With Women In Nampllay Exhibition
  • మహిళలను తాకుతూ అసభ్య ప్రవర్తన
  • రహస్యంగా రికార్డు చేసిన మఫ్టీలో ఉన్న పోలీసులు
  • అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు
  • వీడియో చూసి ఆగ్రహంతో భర్త చెంపలు వాయించిన వైనం
రద్దీగా ఉంది కదా.. ఏం చేసినా చెల్లిపోతుందని అనుకున్నాడు. కానీ, దురదృష్టం వెంటాడి భార్య చేతిలో చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరుగుతున్న ఎగ్జిబిషన్ (నుమాయిష్)కు వచ్చిన ఓ వ్యక్తి రద్దీగా ఉండడంతో మహిళలను అసభ్యంగా తాకుతూ ఆనందం అనుభవించసాగాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు ఈ ఘటనను మొత్తం రహస్యంగా రికార్డు చేశారు. 

ఆపై అతడిని అదుపులోకి తీసుకుని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతడి భార్యకు సమాచారం అందించి పిలిపించారు. అతడు చేసిన నిర్వాకాన్ని వివరించడంతోపాటు రికార్డు చేసిన వీడియోను ఆమెకు చూపించారు. అంతే, అది చూసిన ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అందరి ముందు భర్త చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nampally Exhibition
Numaish
Crime News

More Telugu News