Dharmana Prasada Rao: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మంత్రి ధర్మానకు బెజవాడ బార్ అసోసియేషన్ మెమోరాండం

Bezawada Bar Association gives memorandum to minister Dharmana Prasadarao
  • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అభ్యంతరాలు
  • మెమోరాండం రూపంలో మంత్రికి వివరించిన బెజవాడ్ బార్ అసోసియేషన్
  • చట్టాన్ని ఇప్పుడే అమల్లోకి తీసుకురావడంలేదన్న మంత్రి ధర్మాన
  • వివిధ వర్గాలతో చర్చించాకే అమల్లోకి తెస్తామని వెల్లడి
ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఇవాళ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు మెమోరాండం సమర్పించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తమ అభ్యంతరాలను ఆ మెమోరాండం ద్వారా మంత్రికి వివరించారు. 

దీనిపై మంత్రి ధర్మాన బదులిస్తూ... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఇప్పుడే అమల్లోకి తీసుకురావడంలేదని వెల్లడించారు. రీసర్వే ప్రక్రియ పూర్తయితే తప్ప చట్టం అమల్లోకి రాదని తెలిపారు. న్యాయ నిపుణులు, ప్రజాసంఘాలతో చర్చించిన తర్వాతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి తెస్తామని ధర్మాన స్పష్టం చేశారు. చట్టం అమలు నిబంధనలు, విధివిధానాలు ఇంకా రూపొందించలేదని చెప్పారు. దీనికి సంబంధించి ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా సలహాలు స్వీకరిస్తామని అన్నారు.
Dharmana Prasada Rao
Bezawada Bar Association
Memorandum
Land Titling Act
Andhra Pradesh

More Telugu News