Gyanvapi Case: జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చు... వారణాసి కోర్టు కీలక ఆదేశాలు

Varanasi court issues key orders in Gyanvapi case
  • జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్ లో పూజలు చేసుకోవచ్చన్న కోర్టు
  • పూజలకు ఏర్పాట్లు చేయాలని, పూజారిని నియమించాలని ఆదేశాలు
  • తాము పై కోర్టులో సవాల్ చేస్తామన్న మసీదు కమిటీ
ఉత్తరప్రదేశ్ లోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కేసులో వారాణాసి డిస్ట్రిక్ట్ కోర్టు నేడు కీలక ఆదేశాలు వెలువరించింది. జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. 

జ్ఞానవాపి మసీదులోని దక్షిణ సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. హిందువులు అక్కడ పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్టు ద్వారా ఓ పూజారిని కూడా నియమించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 

జ్ఞానవాపి కేసులో హిందువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దీనిపై స్పందిస్తూ... మరో ఏడు రోజుల్లో పూజ ప్రారంభమవుతుందని, ఇక్కడ పూజ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొన్నారు.

అయితే, వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను తాము పై కోర్టులో సవాల్ చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు.
Gyanvapi Case
Hindu
Puja
Varanasi Court
Uttar Pradesh

More Telugu News