vemulawada: వేములవాడ దేవాలయానికి రావాల్సిన నిధులు ఇవ్వాలని హెచ్ఎండీఏకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

CM Revanth Reddy orders to give funds to vemulawada
  • దేవాలయానికి ఇవ్వాల్సిన రూ.20 కోట్ల నిధులు విడుదల చేయాలని అధికారులకు ఆదేశం
  • వేములవాడలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్‌కు ఆదేశాలు
  • చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం హామీ
హెచ్ఎండీఏ నుంచి వేములవాడ రాజన్న దేవాలయానికి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఆయన టెంపుల్ డెవలప్‌మెంట్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.... వేములవాడలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

అలాగే చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. వేములవాడ దేవాలయ అభివృద్ధిపై మరో సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
vemulawada
Revanth Reddy
GHMC

More Telugu News