Kumari Aunty: కుమారి ఆంటీ హోటల్ మళ్లీ తెరుచుకుంది!

Kumari Aunty hotel opened after CM Revanth Reddy intervention
  • హైదరాబాదులో కుమారి ఆంటీ హోటల్ ను మూసేసిన పోలీసులు
  • సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో సమస్య పరిష్కారం
  • నేడు కుమారి ఆంటీ హోటల్ తెరవడంతో పోటెత్తిన జనాలు
హైదరాబాద్ లో కుమారి ఆంటీ హోటల్ కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు కలుగుతున్నాయని పోలీసులు అడ్డుకోవడం, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి ఆంటీ హోటల్ పై కేసులు ఎత్తివేయాలని ఆదేశించడం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు అనుమతించడంతో నేడు కుమారి ఆంటీ హోటల్ తెరుచుకుంది. కుమారి ఆంటీ హోటల్ మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఉంటుంది.

ఈ హోటల్ మళ్లీ తెరుచుకుందన్న విషయం తెలియడంతో జనాలు పోటెత్తారు. సాధారణంగా వచ్చే జనం కంటే ఇవాళ రెట్టింపు సంఖ్యలో వచ్చారు. కుమారి ఆంటీ హోటల్ ఏరియా రద్దీగా మారిపోయింది. దాంతో, ఆ హోటల్ వద్ద ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. 

కాగా, సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కుమారి ఆంటీ హోటల్ ను సందర్శించనున్నట్టు తెలుస్తోంది .
Kumari Aunty
Hotel
CM Revanth Reddy
Street Food
Hyderabad
Andhra Pradesh

More Telugu News