KTR: నోటీసులు నాకు కాదు... కోమటిరెడ్డికి పంపించాలి: కాంగ్రెస్ నేత మాణిక్కంకు కేటీఆర్ చురక

  • పీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఠాగూర్‌కు ఇచ్చారన్న కేటీఆర్
  • ఈ వ్యాఖ్యలు తాను అనలేదని... కోమటిరెడ్డే అన్నారని గుర్తు చేసిన బీఆర్ఎస్ నేత
  • కోమటిరెడ్డి ఆన్‌రికార్డ్‌గానే అన్నట్లు వెల్లడి
KTR responded on Manikkam Tagore notices

తనపై పరువు నష్టం దావా వేస్తానని నోటీసు పంపిన కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాగూర్ మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. మాణిక్కం ఠాగూర్ నోటీసులను తప్పుగా ఇస్తున్నారన్నారు. పీసీసీ పదవి కోసం మీకు రేవంత్ రెడ్డి రూ.50 కోట్ల లంచం ఇచ్చారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారని... ఆయన ఆన్-రికార్డ్‌గానే ఆరోపించారని కేటీఆర్ గుర్తు చేశారు. కాబట్టి పరువు నష్టం నోటీసులు పంపించాల్సింది తనకు కాదని... కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చురక అంటించారు. ఇప్పుడు కోమటిరెడ్డి మంత్రి అయి సచివాలయంలో కూర్చున్నారని ఆయనకు పంపించుకోవాలని పేర్కొన్నారు.

మాణిక్కం ఠాగూర్‌కు రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు లంచం ఇచ్చారని కోమటిరెడ్డి పేర్కొన్నారని ఇటీవల తన సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ మాణిక్కం ఠాగూర్.. కేటీఆర్‌కు నోటీసులు పంపించారు. తాను కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నోటీసులపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు.

More Telugu News