భారత్‌లో దారుణమైన మార్కెట్లు ఇవే.. ప్రకటించిన అమెరికా
- నకిలీ ఉత్పత్తుల మార్కెట్ల జాబితాను విడుదల చేసిన యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ విభాగం
- తొలి స్థానంలో నిలిచిన చైనా మార్కెట్లు
- ముంబై, ఢిల్లీ, బెంగళూరు మార్కెట్లతో పాటూ మరో 3 ఆన్లైన్ మార్కెట్లకు జాబితాలో చోటు
న్యూఢిల్లీలోని టాంక్ రోడ్డులోని హోల్‌సేల్ మార్కెట్ వస్త్రాలకు పాప్యులర్. ఇక్కడ డెనిమ్ వస్త్రాలు అసంఖ్యాకంగా లభ్యమవుతాయి. బెంగళూరులోని సదర్ ప్రతప్పరోడ్ మార్కెట్ ఎలక్ట్రానిక్ వస్తువులకు ఫేమస్. ఇక్కడ హార్డ్‌వేర్, మెషీన్ టూల్స్ కూడా లభ్యమవుతాయి. అయితే, ఈ మార్కెట్ నకిలీ ఉత్పత్తులకు అడ్డాగా అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇక ముంబైలోని హీరా పన్నా మార్కెట్లో గ్లోబల్ బ్రాండ్స్‌కు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తక్కువ ధరకు లభిస్తాయి. కొత్త ఉత్పత్తుల నకళ్ల కోసం వినియోగదారులు ఈ మార్కెట్‌కు క్యూ కడుతుంటారు. కాగా, హీరాపన్నా, టాంక్ రోడ్డు మార్కెట్లు గతంలోనూ ఈ జాబితాకెక్కాయి.
నకిలీ ఉత్పత్తులతో వాణిజ్యానికి ప్రమాదం పొంచి ఉందని అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి కేథరిన్ టాయ్ పేర్కొన్నారు. వీటితో వర్కర్లు, వినియోగదారులు, చిన్న వ్యాపారాలకు అపార నష్టం ఉందన్నారు. అంతిమంగా వీటితో అమెరికా ఆర్థికరంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందన్నారు.