Revanth Reddy: వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు

  • తాగునీటి కోసం నియోజకవర్గానికి రూ.1 కోటి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని వెల్లడి
  • ఆ ప్రాజెక్టులను తాగునీటికి వాడుకోవాలని సూచన
  • మంచి నీటి సరఫరా బాధ్యత మిషన్ భగీరథ విభాగానిదేనన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy review on water supply in summer season

వేసవి కాలం నీటి ఎద్దడి సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి కోసం నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున ప్రత్యేక నిధులు విడుదల చేస్తామన్నారు.

మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌ను తాగునీటికి వాడుకోవాలని సూచించారు. మంచినీటి సరఫరా బాధ్యత మిషన్ భగీరథ విభాగానిదేనని స్పష్టం చేశారు. తండాలు.. గూడేలు... అటవీ గ్రామాలకు నీరు అందడం లేదని... దీనిపై దృష్టి సారించాలని అన్నారు.

More Telugu News