R Krishnaiah: ముఖ్యమంత్రి రేవంత్ ని కలిసిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

R Krishnaiah met Chief Minister Revanth Reddy at the Secretariat
  • సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్.కృష్ణయ్య
  • రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సత్కరించిన రాజ్యసభ సభ్యుడు
  • బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంను కోరిన ఎంపీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సచివాలయంలో కలిశారు. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఆర్.కృష్ణయ్య శాలువా కప్పి సత్కరించారు.

ఈ సందర్భంగా బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. మంత్రివర్గ విస్తరణలో ఉపముఖ్యమంత్రి పదవితో పాటు ఐదు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భేటీ అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేసే దిశగా సాగుతుండటంతో హామీలపై నమ్మకం ఏర్పడిందన్నారు.
R Krishnaiah
Revanth Reddy
Congress

More Telugu News