Anakapalle: అనకాపల్లి జిల్లాలో దారుణం.. బంగారు గొలుసు కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం.. షాకింగ్ వీడియో ఇదిగో!

Andhra Man Tries to Strangle Elderly Woman to Death here is shocking video
  • జిల్లాలోని గవరపాలెంలో గతవారం ఘటన
  • వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీ
  • పరారీలో నిందితుడు
అనకాపల్లి జిల్లాలోని గవరపాలెంలో గతవారం జరిగిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన కేబుల్ టెక్నీషియన్ ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసుని చోరీ చేసేందుకు తువ్వాలును ఆమె గొంతుకు బిగించి హత్య చేసేందుకు యత్నించాడు. అక్కడున్న సీసీటీవీలో ఈ ఘటన మొత్తం రికార్డయింది. ఈ నెల 26న రాత్రి 7.30 గంటలకు జరిగిందీ ఘటన. 

పని కోసం తరచూ వారింటికి వచ్చే కేబుల్ టెక్నీషియన్ గోవింద్ సోఫాలో 67 ఏళ్ల వృద్ధురాలు కూర్చుని ఉండడం చూశాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మెడలోని బంగారు గొలుసును కొట్టేయాలని భావించాడు. ఈ క్రమంలో తువ్వాలుతో ఆమె గొంతు బిగించి హత్యకు యత్నించాడు. ఈ ఘటనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత వృద్ధురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Anakapalle
Gavrapalem
Crime News
Andhra Pradesh
CCTV

More Telugu News