Lavanya: డ్రగ్స్ కేసులో లావణ్య అనే యువతి అరెస్ట్... టాలీవుడ్ హీరో ప్రియురాలు అంటూ ప్రచారం

  • హైదరాబాద్ నార్సింగిలో డ్రగ్స్ కలకలం
  • లావణ్య అనే యువతి నుంచి 4 గ్రాముల మత్తుపదార్థం స్వాధీనం
  • లావణ్యకు సినీ పరిశ్రమ వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్న వైనం
Hyderabad police arrests Lavanya in drugs case

హైదరాబాదులో పోలీసులు లావణ్య అనే యువతిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నార్సింగిలో డ్రగ్స్ కు సంబంధించిన పక్కా సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలు అనే ప్రచారం జరుగుతోంది. లావణ్యపై పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెకు సినీ పరిశ్రమలోని వ్యక్తులతో పరిచయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమెపై మోకిల పోలీస్ స్టేషన్ లో ఓ డ్రగ్స్ కేసు ఉన్నట్టు వెల్లడైంది. లావణ్య గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తున్నట్టు గుర్తించారు.

More Telugu News