BRS: పార్టీ పరంగా తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది: శ్రీనివాస్ గౌడ్

  • పదవీకాలం ముగుస్తుండటంతో బీఆర్ఎస్ సర్పంచ్‌లకు సన్మానం
  • కార్యకర్తల మనోభావాలను అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళతానని హామీ
  • రాజకీయ పదవుల కంటే అటెండర్ ఉద్యోగం మేలన్న మున్సిపల్ చైర్మన్
Srinivas Goud about defeat of brs

పార్టీ పరంగా కొన్ని తప్పిదాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదవీకాలం ముగుస్తుండటంతో గద్వాలలో బీఆర్ఎస్ సర్పంచ్‌లను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీ పరంగా కొన్ని తప్పిదాల వల్ల బీఆర్ఎస్ మూడోసారి గెలవలేదన్నారు. కార్యకర్తల మనోభావాలను అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్ కూడా పాల్గొన్నారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో పదవులపై ఆయన చురక అంటించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు గౌరవం దక్కలేదన్నారు. రాజకీయ పదవుల కంటే అటెండర్ ఉద్యోగమే మేలని వ్యాఖ్యానించారు.

More Telugu News