Nadendla Manohar: జనసేన ప్రెస్ మీట్లో నాదెండ్ల పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి!

Is CM Jagan really sits beside Nadendla Manohar in Janasena Press Meet
  • ఆసక్తికర ప్రెస్ మీట్ నిర్వహించిన నాదెండ్ల
  • నాదెండ్ల పక్కన ఖాళీగా కనిపించిన కుర్చీ
  • సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకువచ్చి పెట్టిన జనసేన శ్రేణులు
  • మీడియా ముందుకు రాని సీఎంను ఈ విధంగా తీసుకువచ్చామని వెల్లడి 
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ ఓ ఆసక్తికర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో నాదెండ్ల సహా జనసేన అగ్రనేతలు వేదికపై వరుసగా కూర్చున్నారు. 

అయితే, నాదెండ్ల పక్కన కుర్చీని ఖాళీగా ఉంచారు. ఈ కుర్చీలో ఎవరు కూర్చుంటారో చెప్పుకోండి? అంటూ జనసేన శతఘ్ని దీనిపై ఓ ట్వీట్ కూడా చేసింది. ఒకవేళ జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఆ ప్రెస్ మీట్ కు వస్తున్నారేమోనని అందరూ భావించారు. 

కానీ, ఇంతలో సీఎం జగన్ చిత్రపటాన్ని తీసుకువచ్చి ఆ ఖాళీ కుర్చీలో పెట్టారు. 'ఏనాడూ మీడియా ముఖం చూడని ముఖ్యమంత్రిని మీడియా ముందుకు తీసుకువచ్చిన జనసేన' అంటూ వెంటనే జనసేన పార్టీ దీనిపై ఓ వీడియో రిలీజ్ చేసింది. 

ఇక, ఈ ప్రెస్ మీట్ సందర్భంగా... నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ కు బహిరంగ సవాల్ విసిరారు. "మీ ప్రభుత్వ లెక్కల్లో తప్పులపై చర్చించేందుకు మేము 'సిద్ధం'... మీరు సిద్ధమా? దమ్ముంటే చర్చకు రావాలి" అని స్పష్టం చేశారు.
Nadendla Manohar
CM Jagan
Press Meet
Janasena

More Telugu News