: నేను పోటీ చేస్తా, ఆ నిబంధన సవరించండి: సూకీ

మయన్మార్ శాంతి కపోతంగా పేరొందిన నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మార్ ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, తాను పోటీ చేసేందుకు అవరోధంగా మారిన రాజ్యాంగంలోని నిబంధనను సవరించాలని ఆమె కోరారు. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం ఎవరైనా కుటుంబ సభ్యులు అంటే భర్తకానీ, బిడ్డలు కానీ విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే వారికి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. సూకీ భర్త బ్రిటన్ లో విద్యావేత్త. దీంతో వారి కుమారులిద్దరూ బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. 20 ఏళ్లపాటు సూకీ గృహనిర్బంధంలో ఉండగా ఆమె పిల్లలు తమ తండ్రి దగ్గర బ్రిటన్ లో పెరిగారు. దీంతో రాజ్యాంగంలోని ఆ నిబంధనను సవరించాల్సిందిగా అధికార పక్ష సభ్యులకు సూకీ నివేదించారు.

More Telugu News