Aircraft crashes into car: బెల్జియంలో కారుపై కూలిన విమానం!

2 Dead As Light Aircraft Crashes Into Car While Landing In Belgium
  • తూర్పు బెల్జియంలో ఆదివారం వెలుగు చూసిన ఘటన
  • తీవ్ర గాలుల్లో ఓ తేలికపాటి విమానం లాండింగ్‌లో విఫలం
  • ఎయిరోడ్రోమ్ పక్కనే ఉన్న కారుపై కూలిన వైనం
  • విమానంలోని పైలట్, ప్రయాణికుడి దుర్మరణం, కారు డ్రైవర్ సురక్షితం
తీవ్ర గాలుల్లో లాండింగ్‌ చేయబోయి విఫలమైన ఓ తేలికపాటి విమానం రన్‌వే సమీపంలోని కారుపై కూలిన ఘటన బెల్జియంలో వెలుగు చూసింది. తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్‌లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. స్పా ప్రాంతంలోని ఎయిరోడ్రోమ్ పక్కన ఉన్న కారును విమానం ఢీకొన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరూ మృతిచెందారు. మృత పైలట్‌ను అధికారులు జర్మనీ దేశస్తుడిగా గుర్తించారు. ప్రయాణికుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. 

ఘటన సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. ‘లాండింగ్ సమయంలో వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుంది’ అని పోలీసులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్  మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
Aircraft crashes into car
Belgium

More Telugu News