Maldives: మాల్దీవుల పార్లమెంటులో రగడ... కోడిపుంజుల్లా కలబడిన ఎంపీలు

  • ఓ తీర్మానానికి ఆమోదం పొందేందుకు పార్లమెంటులో ఓటింగ్
  • బాహాబాహీకి దిగిన ఎండీపీ, పీఎన్సీ ఎంపీలు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Brawl takes place in Maldivian parliament

మాల్దీవుల పార్లమెంటులో నేడు ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఓ తీర్మానానికి పార్లమెంటు ఆమోదం పొందే క్రమంలో ఇవాళ నిర్వహించిన ఓటింగ్ రసాభాసకు దారితీసింది. ఎండీపీ ఎంపీ ఇసా, పీఎన్సీ ఎంపీ అబ్దుల్లా షహీమ్ పరస్పరం దాడికి దిగారు. మెడ విరిచి, జుట్టు పీకి, కాలు మెలితిప్పి... ఆ ఎంపీల ఫైటింగ్ ఇలా సాగింది. 

ఇరువురూ ఒకరిపై ఒకరు కలబడడంతో ఇతర ఎంపీలు వారిద్దరినీ విడదీసేందుకు తీవ్రంగా శ్రమించారు. 

సదరు, తీర్మానాన్ని వ్యతిరేకించిన కొందరు ఎంపీలు స్పీకర్ పోడియం ఎక్కి, స్పీకర్ చెవిలో బూరతో పెద్దగా ఊదడం మొదలుపెట్టారు. ఆ మోత తట్టుకోలేక స్పీకర్ చెవులు మూసుకోవాల్సి వచ్చింది. ఈ రగడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News