BJP: వివిధ రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించిన బీజేపీ

BJP releases list of state incharges
  • కేరళ ఇంఛార్జ్‌గా ప్రకాశ్ జవదేకర్ నియామకం
  • తరుణ్ చుగ్‌కు జమ్మూ కశ్మీర్, లఢఖ్ బాధ్యతలు
  • బెంగాల్‌కు మంగల్ పాండేను నియమించిన బీజేపీ
మూడు నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్‌లను నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్‌గా వ్యవహరించిన ప్రకాశ్ జవదేకర్‌ను కేరళ ఇంఛార్జ్‌గా నియమించింది. అండమాన్ నికోబార్‌కు సత్యకుమార్, అరుణాచల్ ప్రదేశ్‌కు ‍‌అశోక్ సింఘాల్, చండీగఢ్‌కు విజయభాయ్ రూపానీ, గోవాకు ఆషిశ్ సూద్, డయ్యూ డామన్‌కు పూర్ణేశ్ మోదీ, హర్యానాకు బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్‌కు శ్రీకాంత్ శర్మలను నియమించారు.

జమ్ము కాశ్మీర్‌కు తరుణ్ చుగ్, ఝార్ఖండ్‌కు లక్ష్మీకాంత్ బాజ్ పేయి, కర్ణాటకకు రాధామోహన్ దాస్ అగర్వాల్, లఢఖ్ కు తరుణ్ చుగ్, లక్షద్వీప్‌కు అర్వింద్ మీనన్, మధ్యప్రదేశ్‌కు మహేంద్ర కుమార్ సింఘ్, ఒడిశాకు విజయ్ పాల్ సింఘ్ తోమర్, పుదుచ్చేరికి నిర్మల్ కుమార్, పంజాబ్‌కు విజయ్ భాయ్ రూపానీ, సిక్కింకు దిలీప్ జైశ్వాల్, తమిళనాడుకు అరవింద్ మీనన్‌ను, ఉత్తర ప్రదేశ్‌కు వైజయంత్ జై పాండా, ఉత్తరాఖండ్‌కు దుశ్యంత్ కుమార్, వెస్ట్ బెంగాల్‌కు మంగల్ పాండేలను నియమించారు.
BJP
India
Lok Sabha Polls

More Telugu News