Ravindra Jadeja: ఉప్పల్ టెస్టు.. జడేజాను వెంటాడిన దురదృష్టం

  • అంపైర్ నిర్ణయంపై మండిపడుతున్న నెటిజన్లు
  • బ్యాట్ ను తాకుతూ వెళ్లి ప్యాడ్ కు తగిలిన బంతి
  • అయినా ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడంపై ఫ్యాన్స్ ఫైర్
Unlucky Ravindra Jadeja

ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. 436 పరుగులకు భారత జట్టు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరుకు కేవలం 15 పరుగులు జోడించి మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్ జో రూట్ వరుస బంతుల్లో జడేజా, బుమ్రాలను పెవిలియన్ కు పంపించాడు. అయితే, రవీంద్ర జడేజాను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. రిప్లైలో బంతి ప్యాడ్ కన్నా ముందు బ్యాట్ ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.

ఓవర్ నైట్ స్కోరు 421 పరుగులతో శనివారం మూడో రోజు ఇండియా బ్యాటింగ్ ప్రారంభించింది. 87 పరుగులు చేసిన రవీంద్ర జడేజా సెంచరీ చేస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో జో రూట్ వేసిన బంతి వికెట్ల ముందు జడేజా ప్యాడ్ కు తాకింది. దీంతో జో రూట్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయడం, అంపైర్ వేలు ఎత్తడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే, బంతి బ్యాట్ కు తాకిందని జడేజా రివ్యూ కోరాడు. బంతి ప్యాడ్ కు తాకడానికి ముందు బ్యాట్ కు తాకినట్లు రిప్లైలో స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో జడేజా డీఆర్ఎస్ కోరాడు. పదే పదే రీప్లై చూసిన థర్డ్ అంపైర్ కూడా జడేజాను ఔట్ అని ప్రకటించాడు.

More Telugu News