ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆటోను ఢీ కొట్టిన కారు.. ఒడిశాలో ఏడుగురి మృతి.. వీడియో ఇదిగో!
- సింగిల్ రోడ్ లో అతివేగంగా దూసుకొచ్చిన కారు
- బైక్ ను తప్పించే ప్రయత్నంలో ఆటోను ఢీ కొట్టడంతో ఘోరం
- సీసీటీవీలో రికార్డయిన ప్రమాద ఘటన.. సోషల్ మీడియాలో వైరల్
బోరిగుమ్మ గ్రామం సమీపంలో శనివారం ఉదయం ఓ స్కార్పియో కారు రెండు బైక్ లను, ఓ ఆటోను ఢీ కొట్టింది. ముందు వెళుతున్న ఆటోను ఓవర్ చేసేందుకు ప్రయత్నించిన స్కార్పియో డ్రైవర్ చివరిక్షణంలో ఎదురుగా వస్తున్న బైక్ ను గమనించాడు. బైక్ ను తప్పించే ప్రయత్నంలో ఆటోను వెనక నుంచి ఢీ కొట్టాడు. కారు బాడీ తగలడంతో ఆ బైకర్ కూడా ఎగిరి కిందపడ్డాడు. మరో బైకర్ ను, పక్కనే వెళుతున్న ట్రాక్టర్ ను కూడా కారు వేగంగా తాకింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ బైకర్లను, ఆటో, కారు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరో నలుగురు చనిపోయారని బీజాపూర్ పోలీసులు తెలిపారు. కాగా, ఆటోలో మొత్తం పదిహేను మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.