KTR: రేవంత్ రెడ్డివి అన్నీ అబద్ధాలే ... క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ డిమాండ్

  • దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై అబద్దాలు పలికారని ఆరోపణ
  • రైతుభరోసా ఉందని అబద్దాలు చెప్పడం విడ్డూరమన్న కేటీఆర్
  • 45 రోజుల పాలనలో ఢిల్లీ పర్యటనలు మాత్రమే ఉన్నాయని ఎద్దేవా
KTR demands for Revanth Reddy apology

రైతు భరోసాను ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ... అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు పలికారన్నారు. ఓ వైపు రైతుబంధు కూడా వేయకుండా మరోవైపు లేని రైతుభరోసాను ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. రైతు భరోసా గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అన్నారు.

రేవంత్ రెడ్డి తన 45 రోజుల పాలనలో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పరిపాలన ఢిల్లీ నుంచి సాగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా... రేవంత్ రెడ్డికి కొత్త కార్యాలయం ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. అదానీ సంస్థలను ఓ వైపు తిడుతూనే మరోవైపు ఒప్పందాలు ఎలా చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేలా వెంటాడుతామని హెచ్చరించారు.

దుబాయ్ జైళ్లలో మగ్గుతున్న వారు త్వరలో విడుదల

దుబాయ్ జైళ్లలో మగ్గుతున్న నలుగురు సిరిసిల్ల వాసులు త్వరలో విడుదలవుతున్నారని కేటీఆర్ చెప్పారు. 2009 నుంచి వారి విడుదల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పదిహేడేళ్ల తర్వాత ఈ నలుగురు రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు. వారు త్వరలో విడుదలవుతున్నారని తెలిపారు.

More Telugu News