Animal: రేపు ఓటీటీ తెరపైకి వస్తున్న 'యానిమల్'

  • డిసెంబర్ 1న విడుదలైన 'యానిమల్'
  • భారీస్థాయిలో రాబట్టిన వసూళ్లు 
  • నెట్ ఫ్లిక్స్ చేతికి స్ట్రీమింగ్ రైట్స్ 
  • ఐదు భాషల్లో రేపటి నుంచి స్ట్రీమింగ్    

Animal movie update

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన 'యానిమల్' .. డిసెంబర్ 1వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అనిల్ కపూర్ .. బాబీ డియోల్ .. త్రిప్తి డిమ్రి ముఖ్యమైన పాత్రలను పోషించారు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా, భారీ వసూళ్లనే రాబట్టింది. 

ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నవారు చాలామందినే ఉన్నారు. వాళ్లందరి ముచ్చట తీరడానికి ఎంతో సమయం లేదు. రేపటి నుంచి ఈ సినిమా 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ  భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. 

హీరో పాత్రను డిజైన్ చేసిన తీరు సాధారణమైన స్థాయిని దాటిపోయి కనిపిస్తుంది. టైటిల్ కి తగినట్టుగానే ఆ పాత్రను డిజైన్ చేశారని అనుకోవాలి. హింస ... రక్తపాతం .. అభ్యంతరకరమైన సన్నివేశాలు అక్కడక్కడా కనిపిస్తాయి. త్రిప్తి డిమ్రి గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబట్టుకుంటుందనేది చూడాలి. 

More Telugu News