Saudi Arabia: సంప్రదాయాన్ని బద్దలుగొట్టిన సౌదీ అరేబియా.. తెరుచుకోబోతున్న మద్యం దుకాణం

  • సౌదీలో మద్యంపై 1952 నుంచే కఠిన ఆంక్షలు
  • ముస్లింలు మద్యం తాగడం ఇస్లాంకు వ్యతిరేకమనే నిషేధం
  • తొలిసారి ముస్లిమేతరుల కోసం మద్యం విక్రయాలు
  • మద్యం కావాలంటే తొలుత యాప్‌లో రిజిస్టర్ చేసుకుని విదేశాంగశాఖ అనుమతి తీసుకోవాల్సిందే
  • ఆ తర్వాత నెలవారీ కోటాను వినియోగించుకునే అవకాశం
  • ఫొటోగ్రఫీ, మొబైల్స్‌కు నిషేధం
Saudi Arabia breaks tradition and set to open first liquor shop

సంప్రదాయాల మడికట్టును సౌదీ అరేబియా బద్దలుగొట్టింది. మరికొన్ని వారాల్లో అక్కడ తొలి మద్యం దుకాణం తెరుచుకోబోతోంది. ఈ మేరకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. సౌదీలో 1952 నుంచే మద్యంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. 

మద్యం తాగడం ఇస్లాంకు వ్యతిరేకం. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ తెరుచుకోబోయే మద్యం దుకాణంలో ముస్లిమేతరులకు మాత్రమే మద్యాన్ని విక్రయిస్తారు. ముందుగా వినియోగదారులు ‘డిప్లో’ అనే యాప్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాలి. ఆ తర్వాత నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. 21 ఏళ్ల లోపువారిని స్టోర్‌లోకి అనుమతించరు. ఫొటోగ్రఫీపైనా నిషేధం ఉంది. మద్యం కొనుగోలు చేసే సమయంలో ఫోన్లను కూడా పౌచ్‌లలో లాక్ చేయాల్సి ఉంటుంది.  

సౌదీలో మద్యంపై నిషేధం కారణంగా ఇక్కడ ఆల్కహాల్ బ్లాక్‌మార్కెట్ కూడా విస్తృతంగా ఉంది. ఎంబీసీ స్మగ్లింగ్ ద్వారా ఇక్కడికి మద్యం దిగుమతి అవుతూ ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ఇతర గల్ఫ్ దేశాలు లైసెన్స్ పొందిన సంస్థలలో ముస్లిమేతరులకు మద్యం కొంత అందుబాటులో ఉండేలా అనుమతినిస్తున్నాయి.

More Telugu News