TTD: దర్శన టికెట్లు పొందిన భక్తులకు ఆన్‌లైన్‌లో వసతి గదులు కేటాయించిన టీటీడీ

  • తొలిసారి ప్రత్యేకంగా వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో చేపట్టిన టీటీడీ
  • 2 గంటల 45 నిమిషాల్లోనే ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు
  • ఈ నెల 18 - 24 మధ్య శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్‌తో పాటు పలు టికెట్ల విక్రయం
Allotment of accommodation rooms only for devotees with darshan tickets by TTD

బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్‌ఈడీ) టికెట్లు గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయని టీటీడీ ప్రకటించింది. భక్తులు కేవలం 2 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే కొనుగోలు చేశారని తెలిపింది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడిప్‌, వృద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 18 - 24 మధ్య టీటీడీ అందుబాటులో ఉంచింది. కాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తుల కోసం మాత్రమే తొలిసారి వసతి గదుల కేటాయింపును ఆన్‌లైన్‌లో నిర్వహించింది. ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

More Telugu News