Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్రిటిష్ హైకమిషనర్

British High commissioner meets CM Revanth Reddy
  • ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్
  • అంబేడ్కర్ సచివాలయంలో కలిసిన హైకమిషనర్
  • రేవంత్ రెడ్డితో పాటు ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం సాయంత్రం కలిశారు. అలెక్స్ ఎల్లిస్ వెంట తెలంగాణ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురాం, ఎంఈఏ బ్రాంచ్ సెక్రటరియేట్ హెడ్ జె.స్నేహజ తదితరులు వున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.
Revanth Reddy
Congress

More Telugu News