Family Star: విజయ్ దేవరకొండ సినిమా విషయంలో దిల్ రాజు ప్లాన్ ఛేంజ్?

  • 'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ 
  • ఆయన జోడీకట్టిన మృణాల్ ఠాకూర్
  • నిర్మాతగా ఉన్న దిల్ రాజు 
  • ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ మార్చి 22
  • ఏప్రిల్ 5వ తేదీకి మారే అవకాశం  

Family Star Movie Update

టాలీవుడ్ లో చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.'లైగర్' .. 'ఖుషీ' వంటి సినిమాలు ఆయనతో పాటు ఆయన అభిమానులను కూడా నిరాశ పరిచాయి. ఈ సినిమాలకి ముందు కూడా విజయ్ దేవరకొండ జాబితాలో ఉన్నవి పరాజయాలే. ఈ నేపథ్యంలో ఆయున నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఫ్యామిలీ స్టార్' రెడీ అవుతోంది. 

ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన నాయికగా మృణాల్ ఠాకూర్ అలరించనుంది. ఈ సినిమాను మార్చి 22వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చినట్టుగా సమాచారం. 

నిజానికి ఏప్రిల్ 5వ తేదీన ఎన్టీఆర్ 'దేవర' సినిమా విడుదల కానుంది. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఆ డేట్ లో 'ఫ్యామిలీ స్టార్'ను వదలడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. 

More Telugu News