Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 71 వేలను దాటిన సెన్సెక్స్

  • నిన్నటి భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు
  • 690 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 215 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Sensex crosses 71 K mark

నిన్న భారీ నష్టాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ పుంజుకున్నాయి. ఈరోజు ఉదయం మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ... చివరకు భారీ లాభాల్లో ముగిశాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 690 పాయింట్లు లాభపడి 71,060కి ఎగబాకింది. నిఫ్టీ 215 పాయింట్లు పెరిగి 21,454కు చేరుకుంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.88%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.49%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.44%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.23%), టెక్ మహీంద్రా (3.09%). 

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-2.94%), యాక్సిస్ బ్యాంక్ (-2.77%), ఏసియన్ పెయింట్ (-1.91%), టీసీఎస్ (-0.36%), బజాజ్ ఫైనాన్స్ (-0.17%).

More Telugu News