ఇండియా కూటమిలో ఐక్యతాలోపం.. సింగిల్ గానే పోటీ చేస్తామన్న పంజాబ్ సీఎం మాన్
- లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోబోమన్న మాన్
- మొత్తం 13 లోక్ సభ స్థానాల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని వెల్లడి
- పంజాబ్ లో క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా
లోక్ సభ ఎన్నికల్లో పంజాబ్ లో ఆప్ క్లీన్ స్వీప్ చేస్తుందని... మొత్తం 13 స్థానాలను గెలుచుకుంటుందని మాన్ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్ లో ఘన విజయం సాధించి యావత్ దేశంలోనే ఆప్ హీరోగా నిలుస్తుందని చెప్పారు. 13 లోక్ సభ స్థానాలకు గాను దాదాపు 40 మంది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని తెలిపారు. ప్రతి సీటుపై సర్వే నిర్వహిస్తామని... షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల్లో గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్ ఇస్తామని చెప్పారు. సిట్టింగ్ ఎంపీలకు మాత్రం మళ్లీ టికెట్ కేటాయిస్తామని తెలిపారు.