Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రత విషయంలో కీలక మార్పులు

Key changes in Chief Minister Revanth Reddys security
  • గతంలో కేసీఆర్ వద్ద పనిచేసిన పోలీస్ సెక్యూరిటీని మార్చాలని నిర్ణయం
  • రేవంత్ రెడ్డి వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందనే అభిప్రాయం
  • ఇప్పటికే కొత్త వారిని నియమిస్తూ ఇంటెలిజెన్స్ నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతకు సంబంధించి ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సెక్యూరిటీని మార్చాలని నిర్ణయించింది. సాధారణంగా ముఖ్యమంత్రి మార్పు జరిగిన తర్వాత సెక్యూరిటీలో కొంతమంది కొనసాగుతారు. అయితే రేవంత్ రెడ్డి విషయంలో సెక్యూరిటీని పూర్తిగా మార్చాలని ఇంటెలిజెన్స్ నిర్ణయించింది. సీఎం పరిధిలో జరిగే పలు విషయాలు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని భావించిన ఇంటెలిజెన్స్ వర్గాలు... మాజీ సీఎం కేసీఆర్ వద్ద పని చేసిన సెక్యూరిటీని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం . 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలో కీలక సమాచారం లీక్ కావడంతో కొంతకాలంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో తనకు మాజీ సీఎం కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందిలోని వారిని ఎవరినీ నియమించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో కేసీఆర్ వద్ద పనిచేసిన వారిని ఇంటెలిజెన్స్ తొలగించింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించనున్నారు.
Revanth Reddy
Congress
Telangana
Chief Minister

More Telugu News