acb: హెచ్ఎండీఏ మాజీ అధికారి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు

ACB searches in HMDA former officer residence
  • ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు నిర్వహిస్తోన్న ఏసీబీ అధికారులు
  • అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలోనూ తనిఖీలు
  • శివబాలకృష్ణ, అతని బంధువుల ఇళ్లలో సోదాలు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలలో ఏసీబీ ఆధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్నారు. అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు చేస్తున్నారు. శివబాలకృష్ణ ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో పని చేస్తున్నారు. ఆయన తన పదవిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది. అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
acb
Hyderabad
Telangana

More Telugu News