షర్మిలకు సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్

  • వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని వైవీ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్
  • ఆ సవాల్ తాను స్వీకరిస్తున్నానన్న కాసు మహేశ్
  • గురజాల గల్లీల్లో అభివృద్ధిని చూపిస్తానని వ్యాఖ్య
ఏపీలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలంటూ వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సెటైరికల్ గా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, షర్మిలకు గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సవాల్ విసిరారు. ప్లేస్, డేట్, టైమ్ మీరే చెప్పండి.. వైసీపీ పాలనలో గురజాల రూపు రేఖలు ఎలా మారాయో చూపిస్తానని ఛాలెంజ్ చేశారు. 

జగనన్న సైనికుడిగా, పల్నాటి పౌరుషం ఉన్న కాసు మహేశ్ రెడ్డిగా షర్మిల సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని చెప్పారు. గుంటూరులోనో, విజయవాడలోనో కూర్చొని సవాల్ విసరడం కాదని... గురజాలకు వస్తే గల్లీగల్లీలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో సాగుతోందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ... సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని అన్నారు. 

ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించిన సమయంలో షర్మిల మాట్లాడుతూ... వైసీపీ పాలనలో అభివృద్ది జరగలేదని అన్నారు. అంతేకాదు జగన్ ను జగన్ రెడ్డి అంటూ సంబోధించారు. 

Kasu Mahesh Reddy
Jagan
YV Subba Reddy
YSRCP
YS Sharmila
Congress

More Telugu News