Devara: 'దేవర' రిలీజ్ విషయంలో వినిపిస్తున్న టాక్ ఇదే!

  • షూటింగు దశలో ఉన్న 'దేవర'
  • అప్ డేట్స్ తో పెరుగుతున్న అంచనాలు 
  • సముద్రం నేపథ్యంలో సాగే కథ 
  • విడుదల తేదీ మారనుందని టాక్
Devara Movie Update

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో 'దేవర' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ రామ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాతో, కథానాయికగా జాన్వీ కపూర్ పలకరించనుంది. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. 

అయితే ఇప్పుడు ఈ సినిమా ఆ తేదీకి థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే ఒక టాక్ వినిపిస్తోంది. ఇంకా కీలకమైన .. భారీ సన్నివేశాల చిత్రీకరణ మిగిలే ఉండటం వలన, పాటలను కూడా చిత్రీకరించవలసి ఉన్నందున ఆ సమయానికి రిలీజ్ చేయడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

ఈ సినిమాను జూన్ లో గానీ .. ఆగస్టు 15వ తేదీనగాని విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక టాక్ నడుస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి. సముద్రతీర ప్రాంతంలో నడిచే ఈ కథలో, సైఫ్ అలీఖాన్ .. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

More Telugu News