బైక్ ను వెనక నుంచి ఢీ కొట్టిన కారు.. జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదం
- బుధవారం తెల్లవారుజామున యాక్సిడెంట్
- అక్కడికక్కడే చనిపోయిన బౌన్సర్ తారక్ రాం.. మరో వ్యక్తికి గాయాలు
- ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్.. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు
ఈ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తిని తారక్ రాం గా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. తారక్ రాం జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నాడని వివరించారు. మృతుడికి ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని, తారక్ రాం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.