Special Trains: బాలక్ రామ్ దర్శనం కోసం భక్తుల తహతహ... సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు

  • అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ
  • దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు
  • దేశంలోని అన్ని జోన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు
  • జనవరి 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు ప్రత్యేక రైళ్లు  
Special Trains announced from Secunderabad to Ayodhya

దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యాపురిలో కొలువు దీరిన బాలక్ రామ్ (రామ్ లల్లా)ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ దేశంలోని వివిధ జోన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. 

ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు నెలరోజుల పాటు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి జనవరి 29, 31... ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 18, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

ఒక్కో రైలులో 1400 మంది వెళ్లే వీలుంది. త్వరలోనే ఈ ప్రత్యేక రైళ్లకు నెంబర్లు కేటాయించి, రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

More Telugu News