Nara Lokesh: జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు: నారా లోకేశ్

Nara Lokesh thanked TDP cadre on his birthday
  • నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
  • ఘనంగా వేడుకలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు
  • తన పుట్టినరోజును ఓ పండుగలా చేశారన్న లోకేశ్
  • నా జీవితం ప్రజాసేవకే అంకితం అంటూ ట్వీట్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు. టీడీపీ శ్రేణులు లోకేశ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు... ప్రజాసేవా కార్యక్రమాలతో స్ఫూర్తిగా నిలిచారు... నా పుట్టినరోజును ఓ పండుగలా చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారు. నా జన్మదినం జనానికి ఉపయోగపడేలా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల నా జన్మ సార్థకమైందని ఆనందిస్తున్నాను. వివిధ మాధ్యమాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదాలు నాకు కొండంత బలం. నా జీవితం ప్రజాసేవకే అంకితం" అంటూ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Birthday
TDP
Cadre
Andhra Pradesh
Telangana

More Telugu News