Group-1: ఏపీలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు

  • ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్
  • జనవరి 21తో ముగిసిన దరఖాస్తుల గడువు
  • జనవరి 28 వరకు పొడిగించిన ఏపీపీఎస్సీ
  • గడువు మరోసారి పొడిగించబోమని స్పష్టీకరణ
APPSC extends Group 1 applications time line

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత పేర్కొన్న ప్రకారం గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల గడువు జనవరి 21తో ముగిసింది. 

అయితే, దరఖాస్తుల గడువును ఏపీపీఎస్సీ నేడు పొడిగించింది. జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నామని, మరోసారి పొడిగించేది లేదని స్పష్టం చేసింది. 

నోటిఫికేషన్ లో పేర్కొన్నట్టే... మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ జరుగుతుందని వెల్లడించింది. గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు https://psc.ap.gov.in వెబ్ పోర్టల్ ను సందర్శించాలని ఏపీపీఎస్సీ సూచించింది.

More Telugu News