Congress: కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్... నిందితుడి అరెస్ట్

Hyderabad police arrested rajasthan man for crowd funding
  • ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ తయారు చేసిన రాజస్థాన్ వాసి
  • నకిలీ వెబ్ సైట్‌తో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
  • రాజస్థాన్ వెళ్లి సురేంద్ర చౌదరి అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ తయారు చేసి క్రౌడ్ ఫండింగ్ చేసిన రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పేరుతో జైపూర్‌కు చెందిన సురేంద్ర చౌదరి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ నకిలీ వెబ్ సైట్‌తో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఎంతోమంది పార్టీ అభిమానులు ఈ వెబ్ సైట్ ద్వారా డబ్బులు చెల్లించారు. తమ పార్టీ పేరుతో ఎవరో క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు నిందితుడు రాజస్థాన్ వాసిగా గుర్తించి అక్కడకు వెళ్లి అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు.
Congress
arrest

More Telugu News