Nara Lokesh: లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో 1100 కేజీల కేక్ కట్ చేసిన టీడీపీ నేతలు

  • నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
  • భారీ కేక్ తెప్పించిన లోకేశ్ వీరాభిమాని కొమ్మారెడ్డి
  • విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా ఈ 1100 కేజీల కేక్
TDP leaders cut 1100 kg huge cake on Nara Lokesh birthday

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. లోకేశ్ వీరాభిమాని కొమ్మారెడ్డి ఈ 1100 కేజీల భారీ బర్త్ డే కేక్ ను సిద్ధం చేశారు. టీడీపీ అగ్రనేతలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కాల్వ శ్రీనివాసులు ఈ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కిమిడి కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు తదితర టీడీపీ సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. విజయవాడలో ఈ కేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనేక మంది ఈ కేక్ ను సందర్శించారు. దీనిపై మన మంగళగిరి-మన లోకేశ్ అని రాశారు.

More Telugu News